Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు రేవంత్రెడ్డి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో అనేక వర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమంలో అసువులుబాసిన అమరులకు పరిహారమిస్తామంటే నమ్మేదెలా? అని ప్రశ్నించారు. ఆదివారం నాడొక ప్రకటనను ఆయన విడుదల చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించడంలో సర్కారు విఫలమైందని విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డుబ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం టీఆర్ఎస్ పాలనలో 7,500 మంది రైతులు మరణించారని చెందారనీ, బాధిత రైతు కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని తెలిపారు. హైదరాబాద్ నగర వరద బాధితులకు కూడా ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు. పంజాబ్లో చనిపోయిన రైతుల కుటుంబాలకు మూడు లక్షల రూపాయల పరిహారం ఇస్తామంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.