Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్లు లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతాంగ ఉద్యమానికి ఐద్వా సంఘీభావం ప్రకటిస్తున్నదనీ, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ఘాజీపూర్‌లో రైతులు ఏడాది కాలంగా చేస్తున్న పోరాట శిభిరాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల ఫలితంగా 750మంది రైతులు చనిపోయారని చెప్పారు. అయినా తమ డిమాండ్ల సాధనకోసం ధైర్యంగా ఉద్యమించారనీ, వారికి ఐద్వా జేజేలు పలుకుతుందని తెలిపారు. కారణాలేమైనా మోడీ ప్రభుత్వం దిగివచ్చిందని చెప్పారు. నల్ల చట్టాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిందనీ, పార్లమెంట్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఈ పోరాటం కొనసాగించాలని నిర్ణయించటం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో జరగబోయే పోరాటాలకు అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం బాసటగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్. అరుణజ్యోతి, మాచర్ల భారతి తదితరులు పాల్గొన్నారు.