Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలిపీఛెడ్
మెదక్ జిల్లా చిలిపీఛెడ్ మండల పరిధిలోని సొమ్మక్కపేట కొనుగోలు కేంద్రంలో వరిధాన్యానికి మొలకలొచ్చాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 23 రోజులవుతున్నా.. కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం కుప్పలుగా పేరుకుపోయింది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి మొలకలొచ్చాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం తూకం వేయాలని రైతులు కోరుతున్నారు.