Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ఆందోళన
నవతెలంగాణ-కోదాడరూరల్
ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారని నిర్వాహకుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ- ఖమ్మం ప్రధాన రహదారిపై బైటాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కోదాడ పీఏసీఎస్ పరిధిలోని తమ్మర గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. దీని వల్ల అకాల వర్షాలకు ధాన్యపు రాశులు నీటి పాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ధాన్యపు రాశులపై కప్పడానికి టార్పలిన్లు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. సెంటర్లో కనీస వసతులు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారన్నారు.
వర్షం వస్తే తమ ధాన్యం కొనేదేవరని నిర్వాకులను ప్రశ్నించారు. కాసులకు కక్కుర్తి పడి మిల్లర్లు చెప్పినట్టు అధికారులు నడుచు కుంటూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ఆం దోళనను విరమింపజేశారు. స్పందించిన పీఏసీఎస్ డైరెక్టర్ కమతం వెంకటయ్య అధికారులదృష్టికి సమాచారం అందించడంతో జిల్లాపౌర సరఫ రాల అధికారి రాంపతి ఐకేపీ సెంటర్ను పరిశీలించి ప్రతి ఒక్కరి ధాన్యాన్ని కొనాలనీ, రైతులను ఇబ్బంది పెట్టొద్దని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఆరంభించారు. ఆయన వెంట సివిల్ సప్లై డీటీలు విమోచన, రాజశేఖర్, ఏఆర్ ఇందిరా, ఏఈఓ చందబి, రైతులు కన గాల నారాయణ, కనకయ్య, బోళ్లు ప్రసాద్, నెల్లూరి రామారావు, కనగల రవి,కమతం శ్రీనివాసరావు,బత్తినేని శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు.