Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ చాలా రోజుల తర్వాత ఇలా కలిసి పక్కపక్కనే కూర్చొని చాలాసేపు ముచ్చటించారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డి వివాహం ఏపీ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌రెడ్డితో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని వీఎన్ఆర్ ఫామ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరై సందడి చేశారు. వేదిక మీదకు వెళ్లి వధువరూలను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో ఇరు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.