Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వచ్చే మూడేండ్లలో రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆజాద్ ఇంజినీరింగ్ వెల్లడించింది. ప్రెసిషన్ ఇంజనీరింగ్ సేవలను అందించే తమ సంస్థ మేడ్చల్‌లో తమ మూడో అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. 23.45 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఈ ప్లాంట్‌కు సోమవారం శంకుస్థాపన చేసింది. 2022 జులై నాటికి పూర్తి కానున్నట్టు తెలిపింది. విమానయాన, విద్యుత్ రంగాల్లోని పలు అంతర్జాతీయ కంపెనీలకు సూపర్ క్రిటికల్ విడిభాగాలను తయారు చేసి ఎగుమతి చేయనున్నట్టు ఆ కంపెనీ ఎండీ రాకేష్ చాప్దర్ తెలిపారు.