Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ శ్రేణులకు రేవంత్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై బుధ, గురువారాల్లో వినతిపత్రాలు సమర్పించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి రైతులకు నష్టం చేస్తున్నదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ధాన్యం అమ్మకాల కోసం రైతులు కల్లాల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నదని తెలిపారు. భారీ వర్షాలకు ధాన్యం పూర్తిగా పాడైందనీ, దీంతో రైతులు పెద్దఎత్తున నష్టపోతారని గుర్తు చేశారు. కల్లాల వద్ద రైతులు అనారోగ్యాలతోనూ, పాములు కరిచి చనిపోతున్నా రని ఆవేదన వ్యక్తంచేశారు. అటువంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం పరామర్శించలేదని విమర్శించారు. చావు సాయం కోసం రైతు కుటుంబాలు కోర్టు ముందు కన్నీళ్లు పెడుతున్నారని తెలిపారు.67 వేల మంది రైతులకు పరిహారమిచ్చామంటున్న సర్కారుకు 3,942 మంది భారమయ్యారా? అని ప్రశ్నించారు.
బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించింది కాంగ్రెస్సే : రేవంత్‌రెడ్డి
బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించింది కాంగ్రెస్ పార్టీ యేనని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్‌కు అండగా నిలబడి యుద్ధంలో పాకిస్తాన్‌ను ఇండియా ఓడించిందని తెలిపారు. బంగ్లాదేశ్ ఏర్పడి 50 ఏండ్లు అవుతున్న సందర్భంగా మంగళవారం గాంధీభవన్‌లో బంగ్లాదేశ్ విముక్తి ఉత్సవాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఉత్సవ కమిటీ కన్వీనర్ ప్రవీణ్ దావర్ మాట్లాడుతూ ఇండియా, పాకిస్తాన్ 1971 యుద్ధంలో నాలుగు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వివరించారు. మల్లు భట్టి విక్రమార్క మాట్లాడూతూ ఆనాటి లిబరేషన్ వార్‌లో ఇందిరాగాంధీ ప్రధాన పాత్ర పోషించారని గుర్తు చేశారు.
జంగా రాఘవరెడ్డికి షోకాజ్
జనగాం డీసీసీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డితోపాటు ఇద్దరు జిల్లా కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మెన్ జి చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు భౌతికదాడికి పూనుకోవడంతో అందుకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.