Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో 38,441 మందికి సీట్లను డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా బుధవారం ఉన్నత విద్యామండలి కేటాయించింది. ఈ మేరకు కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మెన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఒక ప్రకటన విడుదల చేశారు. దోస్త్ ప్రత్యేకవిడతలో 39,671 మంది వెబ్ఆప్షన్లు నమోదు చేశారనీ, వారిలో 38,441 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించామని వివరించారు. తక్కువ వెబ్ఆప్షన్లు ఇచ్చినందున 1,230 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించలేదని పేర్కొన్నారు.