Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చేనెల 6 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన
- 11 నుంచి 13 వరకు వెబ్ఆప్షన్ల నమోదు
- 17న సీట్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు లాసెట్ ప్రవేశాల కన్వీనర్ పి రమేష్‌బాబు బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు. ప్రవేశాల నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేస్తామని తెలిపారు. 27 నుంచి వచ్చేనెల 6 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందనీ, స్కాన్ చేసిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు (ఎన్సీసీ, క్యాప్, వికలాంగులు, క్రీడల విభాగం) వచ్చేనెల 6 నుంచి 10 వరకు భౌతికంగా ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. 10న రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల వివరాలను ప్రకటి స్తామని తెలిపారు. 11 నుంచి 13 వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు. 17న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. 18 నుంచి 23 వరకు సీట్లు కేటాయించిన అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన తోపాటు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలనీ, ట్యూషన్ ఫీజు చలానా ఇవ్వా లని కోరారు. 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. లాసెట్‌కు 39,805 మంది దరఖాస్తు చేయగా, 29,629 మంది పరీక్ష రాశారు. వారిలో 20,398 (68.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.