Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మృతి
నవతెలంగాణ- మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలోని కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢకొీనడంతో ముగ్గురు ప్రాణం కోల్పోయారు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పేట్ బషీరాబాగ్‌కు చెందిన పవన్ కుమార్‌రెడ్డి(21), సుమంత్‌రెడ్డి(20), శంకర్ రెడ్డి(38) పని మీద ఖమ్మం వెళ్లి తిరిగి కారులో వస్తున్నారు. కీసర నుంచి శామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు మార్గంలో వస్తుండగా.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢకొీట్టారు. దాంతో సుమంత్‌రెడ్డి, శంకర్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు కీసర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ నరేందర్ గౌడ్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాల తో ఉన్న పవన్ కుమార్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అతనూ చనిపోయాడు.