Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులకు, తమకూ సంబంధం లేదని, సీబీఐ క్విడ్‌ప్రోకో ఆరోపణలకు ఆధారాల్లేవని వాన్‌పిక్, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ల తరఫున బుధవారం హైకోర్టులో వాదనలు కొనసాగాయి. తమపై తప్పుడు ఆరోపణలతో ఆధారాలు లేకుండా సీబీఐ పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ వాన్‌పిక్, నిమ్మగడ్డ ప్రసాద్ వేసిన రిట్లను జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ జరిపారు. మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా అందరికీ ఇచ్చే విధానంలో తమకు కూడా ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందనీ, అనేక రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలకు ఎకరం రూపాయికి ఇచ్చిన సంద ర్భాలు ఉన్నాయని వారి తరపున న్యాయవాది వాదించారు. క్యాబి నెట్‌ను ప్రభావితం చేసే స్థాయిలో తాము లేమనీ, సీబీఐ తమకు అను కూలంగా ఉన్న విషయాలను వెల్లడించకుండా, వ్యతిరేక అంశాలనే చెబుతోందన్నారు. వాదనలు గురువారానికి వాయిదా పడ్డాయి.
ట్రైనీ ఐఏఎస్ కేసు పురోగతి తెలపాలి
ట్రైనీ ఐఏఎస్ ఎంఎల్ భానోత్, కుటుంబసభ్యులపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి గురించి తెలియజేయాలని బధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఆదేశించారు. గురువారం జరిగే విచారణ నాటికి వివరాలు ఇవ్వాలన్నారు. వాళ్లపై కేసును రాజీ చేసుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారనీ, కేసు దర్యాప్తు చేయడం లేదని ఫిర్యాది లాయర్ వాదించారు. తాము కూడా కౌంటర్ కేసు పెట్టామని భానోతు తరపున న్యాయవాది చెప్పారు. కూకట్పల్లి పోలీసులు పెట్టిన కేసులో కఠినంగా వ్యవహరించరాదని ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.