Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన కౌన్సెలింగ్ ప్రక్రియ
- సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువు 26
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 79,856 సీట్లున్నాయనీ, 57,177 (71.60 శాతం) మందికి సీట్లు కేటాయించామని వివరించారు. ఇంజినీరింగ్‌లో 22,679 (28.4 శాతం) సీట్లు మిగిలాయని తెలిపారు. 172 ఫార్మసీ కాలేజీల్లో 4,426 సీట్లుంటే, 223 (5.03 శాతం) మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఫార్మసీ విభాగంలో 4,203 సీట్లు మిగిలాయని తెలిపారు. ఇంజినీరింగ్, ఫార్మసీ కలిపి 26,882 సీట్లు మిగిలాయని వివరించారు. ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్‌ను తప్పనిసరిగా చేయాలనీ, దీనికి ఈనెల 26 వరకు గడువుందని పేర్కొన్నారు. 26 వరకు కాలేజీల్లో చేరాలని సూచించారు.