Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నుంచి తనకు ఎలాంటి జీతభత్యాలు వద్దని చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌కు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. శాసనసభ సభ్యునిగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలునని, టీయస్ ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్థిక భారం మోపడం ఇష్టం లేక తన వంతుగా ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ నిర్ణయం పట్ల ఎమ్డీ సజ్జనార్ హర్షం ప్రకటించారు. ఇదో చారిత్రాత్మక నిర్ణయమనీ, వారిచ్చిన స్ఫూర్తితో సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పారు. దీనిపై ఆర్టీసీ సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పున్న హరికిషన్ కూడా ఓ ప్రకటనలో ఆర్టీసీ చైర్మెన్‌కు అభినందనలు తెలిపారు.