Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టివేత
నవతెలంగాణ- శంషాబాద్
రిస్ట్ వాచ్లో బంగారం దాచి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న నిందితున్ని శంషాబాద్ ఆర్జీఐ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం పట్టుకు న్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షార్జా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన విమానంలో మధ్య రాత్రి ప్రయాణికుడు వచ్చాడు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా రెండు రిస్ట్ వాచ్ల్లో దాచుకుని తెచ్చిన రూ. 11.56లక్షల విలువైన 233.4 గ్రాముల బంగారం పట్టుబడింది. గమనించిన కస్టమ్స్ అధికారులు రిస్ట్ వాచ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.