Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో టాప్ 10 లోపు 8, ఆంధ్రప్రదేశ్లో టాప్ 10 లోపు
8 ర్యాంకులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నీట్ 2021 స్టేట్ ర్యాంకుల్లో శ్రీచైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. టాప్ ర్యాంకుల్లోనూ, టోటల్ ర్యాంకుల్లోనూ తిరుగులేని అగ్రస్థానంతో దూసుకెళ్ళింది. శ్రీచైతన్య విద్యార్థులే నెం.1గా స్టేట్ 2వ ర్యాంక్ రుషిల్, 3వ ర్యాంక్ కౌశిక్ రెడ్డి, 4వ ర్యాంక్-గోపీచంద్ రెడ్డి, 5వ ర్యాంక్ సత్య కేశవ్. 7వ ర్యాంక్ కార్తీక్, 8వ ర్యాంక్ వెంకటకల్పజ్, 9వ ర్యాంక్ చైతన్య కృష్ణ. 10వ ర్యాంక్ సాకేత్, ఒక్క శ్రీచైతన్య విద్యార్థులవే. అలాగే గత శనివారం విడుదలైన తెలంగాణ ర్యాంకుల్లోనూ శ్రీచైతన్య విద్యార్థులే నెం.1గా స్టేట్ 2వ ర్యాంక్ శశాంక్. 3వ ర్యాంక్ లహరి, 4వ ర్యాంక్ శ్రీనిజ, 6వ ర్యాంక్ శరణ్య, 7వ ర్యాంక్ విశ్వాస్ రావు, 8వ ర్యాంక్ లాస్య, 9వ ర్యాంక్ సమీ హనా రెడ్డి, 10 వ ర్యాంక్ ప్రమోద్ టాప్ 10 లోపు 8, టాప్ 100 లోపు 7 ర్యాంకులు ఒక్క శ్రీచైతన్య విద్యార్థులవే. ఈసారీ రాష్ట్ర, జాతీయ మెడికల్ కాలేజీల్లో మొదటి వరుసతో పాటు మొత్తం సీట్లలోనూ అత్యధిక శాతం వాటా శ్రీచైతన్యదేనని నిరూపించారు.
ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్, ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండర్ డైరెక్టర్ సుష్టు మాట్లాడుతూ.. కరోనా సమయంలోనూ ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో నాణ్యమైన శిక్షణను అందిస్తూ అనితరసాధ్యమైన ప్రోగ్రాములు, మైక్రోషెడ్యూల్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్ సిస్టమ్స్, నిరంతరం శ్రమించే దేశంలోనే టాప్ ఫ్యాకల్టీ కారణంగానే ఇంతటి ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. అందువల్లే నీట్ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు శ్రీచైతన్యనే కోరుకుంటున్నారన్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని శ్రీచైతన్య అధినేత డాక్టర్ బి.ఎస్.రావు అభినందించారు.