Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ బస్సు గొప్పదనాన్ని కీర్తిస్తూ కిన్నెర కళాకారుడు మొగులయ్య పాడిన పాటకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. తన కుమార్తె పెండ్లికి ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్న మొగులయ్య, ప్రజారవాణా ప్రాధాన్యతను తెలుపుతూ కిన్నెర వాయిద్యం మోగిస్తూ పాట పాడారు. ఆపాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యి లక్షల మంది నెటిజన్లు చూశారు. అంతే సంఖ్యలో లైక్‌లు కూడా చేశారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ బుధవారం మొగులయ్యను బస్‌భవన్‌కు పిలిపించి, సత్కారం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఆయన ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై మొగులయ్య స్పందిస్తూ ఇది కళాకారుల పట్ల ఆర్టీసీ ఎమ్డీ సజ్జనార్‌కు ఉన్న గౌరవానికి ప్రతీక అని కొనియాడుతూ, కృతజ్ఞతలు తెలిపారు.