Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు తీర్పు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒకేస్థాయి పదవిలో ఉన్న వారికి పదోన్నతులు కల్పించేటప్పుడు లింగ బేధం చూపడం రాజ్యాం గ విరుద్ధమని హైకోర్టు తీర్పు చెప్పింది. జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ పదవిలో ఉన్న మగవాళ్లకు మాత్రమే సూపరింటెండెంట్ పదోన్నతి కల్పించేలా 1996లో వెలువడిన జీవో 316ను డిస్మిస్ చేసింది. మగవారికి మాత్రమే పదోన్నతి ఇవ్వడం, మహిళ కాబట్టి తనకు సూపరింటెండెంట్‌గా పదోన్నతి ఇవ్వకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ డిప్యూటీ సూపరింటిండెంట్ వెంకట లక్ష్మి శ్రీనాథ్ వేసిన వ్యాజ్యంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. లింగబేధం లేకుండా ఆమెకు పదోన్నతి ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది.