Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లాలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నవతెలంగాణ-పరిగి
అకాల వర్షాలు పైర్లు, పంటను ముంచేయడంతో పెట్టుబడి అప్పులు తీరే దారి లేక ఆందోళనకు గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని మాదారంలో జరిగింది. ఎస్ఐ విట్టల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డే రాములు(46)కు ఎకరా అసైన్డ్ భూమి ఉంది. మరో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి, మొక్కజొన్న పంట సాగు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంటకు ముందు తెచ్చిన అప్పులు, పంట చేతికి రాకపోవడంతో అప్పులు కావడంతో భయాందోళనకు గురయ్యాడు. బ్యాంకుల్లో 40 వేల అప్పుల, బయట దాదాపుగా రూ.2లక్షల 60 వేల అప్పు ఉందని కుటుంబసభ్యులు వాపోయారు. దాంతో గురువారం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. రైతు భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.