Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజామాబాద్ జిల్లాలో
నవతెలంగాణ-జక్రాన్పల్లి
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని మునిపల్లి వీడీసీ (గ్రామాభివృద్ధి కమిటీ)పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఆసిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. మునిపల్లి గ్రామంలోని శివాలయానికి వెళ్లే దారి విషయంలో తీర్మానాన్ని పాటించలేదని గ్రామంలోని నాయకపోడు కులస్తులకు వీడీసీ రూ.15వేల జరిమానా విధించింది. జరిమానా కట్టాల్సిందేనని వారిని ఒత్తిడికి గురిచేసింది.