Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటింటి సర్వే నిర్వహించాలి : మంత్రి హరీశ్ రావు
నవతెలంగామ బ్యూరో - హైదరాబాద్
డిసెంబర్‌లోగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల వైద్యాధికారులు, ఆశా, ఏఎన్ఎంలతో ఆయన గురువారం సిద్ధిపేట నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి డోసు, రెండో డోసు తీసుకున్న వారెంత మంది ఉన్నారనే విషయాలపై పక్కా సమాచారాన్ని సేకరించాలని కోరారు. మహిళల్లో రక్తహీనతపై అవగాహన కల్పించాలనీ, పోషకాహారం అందేలా చూడాలనీ, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పిల్లలకు వంద శాతం సాధారణ టీకాలు ఇవ్వాలనీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాము, తేలు, కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ద్వారా వీటిని ప్రాథమిక దశలోనే గుర్తించాలని కోరారు. ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు, డాక్టర్లకు పీఆర్సీ ఇచ్చామనీ, ప్రభుత్వ సిబ్బంది అందరికీ వేతనాలు పెంచామని గుర్తుచేశారు. ఆశా నుంచి డాక్టర్ల వరకు అందరూ కర్తవ్య నిర్వహణ కోసం కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో 18 జిల్లాల వైద్యాధికారులు, 157 మంది ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 501 మంది మెడికల్ ఆఫీసర్లు, 1,161 మంది హెల్త్ సూపర్ వైజర్లు, 4,394 మంది ఏఎన్ఎంలు, 13,329 మంది ఆశాలు పాల్గొన్నారు.