Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతుల స్ఫూర్తితో బీసీల హక్కుల సాధన కోసం ఢిల్లీలో ఐక్యంగా ఉద్యమిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ అన్నారు.రైతు ఉద్యమ సారథి రాకేశ్ తికాయత్ బృందాన్ని హైదరాబాద్లో ఆయన గురువారం అభినందించారు. జాతీయ స్థాయిలో బీసీల ఆకాంక్షల సాధన కోసం జరిగే పోరాటానికి తికాయత్ మద్దతు ప్రకటించారని వివరించారు. కేంద్రస్థాయిలో కుల గణన చేపట్టా లని కోరారు.చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని సూచించారు. ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రయివేటుపరమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రయివేటురంగంలోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు.13 రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన మూడు లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు కేవలం ఒక ఎంపీ, ఏడు అసెంబ్లీ స్థానాల్లో గెలిచారని వివరించారు. మోడీ ప్రభుత్వం ఆత్మపరిశీలనలో పడి నష్టనివా రణ జరగకుండా జాగ్రత్త పడిందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాల్సిందేనని పేర్కొన్నారు. కాదంటే ప్రజాక్షేత్రం నుంచి పార్టీలు కనుమరుగు కాక తప్పదని హెచ్చరించారు.