Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గచ్చిబౌలి వద్ద 2020 అక్టోబర్‌లో హేమంత కుమార్ పరువు హత్య కేసులో ఇద్దరు నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. సంతోష్‌రెడ్డి, సందీప్రెడ్డిలకు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత స్పష్టం చేశారు. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపట్టే దశలో బెయిల్ ఇవ్వకూడదనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) వినతిని న్యాయమూర్తి ఆమోదించారు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారనీ, హేమంత్ తల్లిని బెదిరించిన ఘటన కూడా ఉందని ఫిర్యాదుదారు చెప్పారు. వాదనల తర్వాత బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.
ట్రైనీ ఐఏఎస్ : కేసుల రిట్లపై మధ్యంతర ఉత్తర్వులు
శిక్షణలో ఉన్న ఐఏఎస్ ఎంఎల్ బానోత్తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలైన రిట్లపై హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. బానోత్‌పై తదుపరి విచారణ జరిగే వరకూ 15 రోజులపాటు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఆదేశించారు. దీంతోపాటు బానోత్ తల్లిదండ్రులకు సీఆర్పీసీలోని 41ఎ సెక్షన్ కింద నోటీసు ఇచ్చాకే విచారించాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. బానోత్‌పై కూకట్పల్లి పీఎస్‌లో అత్యాచార ఆరోపణలు, ఆయన తల్లిదండ్రులపై వేరే కేసులు నమోదయ్యాయి. వీటిలో బెయిల్ కావాలన్న కేసుల విచారణను కోర్టు రెండు వారాలు వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తులతో మాకు సంబంధం లేదు
వాన్‌పిక్, నిమ్మగడ్డ ప్రసాద్ వివరణ
వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులతో తమకు సంబంధం లేదనీ, సిబిఐ క్విట్ప్రోకో ఆరోపణలకు ఆధారాల్లేవని వాన్‌పిక్ సంస్థతోపాటు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన కేసుల విచారణ ఈనెల 29కి వాయిదా పడింది.