Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమ్మెను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జుడా) తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ నాయకులు మణికిరణ్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులతో పాటు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేకాధికారి, ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారితో చర్చలు జరిగినట్టు తెలిపారు. కాగా శుక్రవారం నిరసనలు యధావిథిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. అదే సమయంలో మంత్రి హరీశ్ రావుతో సమావేశమై చర్చించనున్నట్టు తెలిపారు. మంత్రితో చర్చల అనంతరం తదుపరి కార్యాచరణ నిర్ణయించుకుంటామని తెలిపారు.