Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రెగ్యులర్ వైద్య పరీక్షల్లో భాగంగా బుధవారం రాత్రి చేయించిన కోవిడ్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ ఉన్నట్టు బయటపడింది. దీంతో గురువారం గచ్చిబౌలిలోని ఏసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో ఆయన చేరారు. కాగా ఇటీవల పోచారం తన మనవరాలి పెండ్లిలో పలువురు రాజకీయ ప్రముఖులను కలిశారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్‌తో పాటు ప్రముఖ రాజకీయ నాయకులందరూ హాజరయ్యారు. కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలతో హౌమ్ ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ కోరారు.
రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి త్వరంగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు.