Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిషన్ రెడ్డి, బండి సంజరు లకు బోయినపల్లి వినోద్ కుమార్ సూచన
నవతెలగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోందన్న వాస్తవాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు గ్రహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హౌదా సాధించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం...అనేక రంగాల్లో దేశ నిష్పత్తి కన్నా రాష్ట్ర నిష్పత్తి మెరుగ్గా ఉందని తెలిపారు. కేవలం రాజకీయంగా విమర్శలు చేయడం, ప్రగల్భాలు పలకడం మానుకోవాలని వినోద్ కుమార్ హితవు పలికారు. వీలైతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిధుల విడుదలకు, కొత్త పథకాలను తేవాలని సవాల్ చేశారు. వ్యవసాయ రంగంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో దేశ వ్యాప్త నిష్పత్తి 34.2 శాతం కాగా, రాష్ట్ర నిష్పత్తి మూడింతలు పెరిగి 108.8 శాతంగా ఉందనీ, వరి పంట ఉత్పత్తిలో దేశ సగటు 12.7 శాతమైతే, రాష్ట్ర సగటు 67.3 శాతమని చెప్పారు. అదే విధంగా పత్తి, మాంసం ఉత్పత్తిలో రాష్ట్ర పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. విద్య, విద్యుత్ రంగాల్లోనూ ప్రగతిలో ముందుకెళుతుందని తెలిపారు. ఇకనైనా బీజేపీ నాయకులు నిర్మాణాత్మక పాత్రను పోషించాలని సూచించారు.