Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ కు ల్యాబ్ టెక్నీషియన్ల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గెజిటెడ్ ప్రమోషన్లను సకాలంలో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల రవీందర్, అదిలాబాద్ జిల్లా నాయకులు బండారు కృష్ణ హైదరాబాద్‌లో గురువారం మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. పదోన్నతుల కోసం డీపీసీ ఉత్తర్వులను జారీ చేయించాలన్నారు. రెగ్యులర్, కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలనీ, రెగ్యులరైజేషన్‌పై సమీక్ష నిర్వహించాలని విన్నవించారు. ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని ప్రస్తావించారు. 24 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులందరినీ గెజిటెడ్ అధికారులుగా పరిగణించాలనీ, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు.