Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాహేతర సంబంధమే కారణం..?
నవతెలంగాణ-లింగంపేట్
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టులో దూకి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన గురువారం వెలుగుజూసింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. లింగంపేట్ మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన కత్తుల సంతోష్ (32)కు, అదే గ్రామానికి చెందిన గ్యార బోయిన రాణి (26)కి ఆరేండ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే వీరివురూ మూడు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లారు. గురువారం ఉదయం నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టు గోల్ బంగ్లా సమీపంలో శవాలై తేలారు. ఇద్దరూ కాళ్లకు తాడుతో పాటు, నడుముకు చున్నీ కట్టుకుని ప్రాజెక్టులో దూకినట్టు తెలుస్తోంది. వీరి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. వీరిద్దరూ ఒకే కులానికి చెందిన వారు కావడంతో ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న శెట్పల్లి సంగారెడ్డి గ్రామస్తులు పెద్ద ఎత్తున పోచారం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. కాగా ఘటనపై మెదక్ జిల్లా గన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.