Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విద్యానగర్
ఆరోగ్య రక్షణతో పాటు, వాతావరణ కాలుష్య నివారణకు హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ సభ్యులు చేపట్టిన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి యాత్ర బుధవారం రాత్రి ఆదిలాబాద్‌కు చేరుకుంది. యాత్ర సభ్యులకు జిల్లా కేంద్రానికి చెందిన ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ అధ్యక్షుడు ఆదిత్య ఖండేష్కర్ విడిది ఏర్పాటు చేశారు. గురువారం సైకిల్ యాత్రకు స్థానిక నాయకులు జెండా ఊపి వీడ్కోలు పలికారు. దాదాపు 3,700 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర వారు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రాష్ట్ర నాయకురాలు సుహాసినిరెడ్డి, జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, జెడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి, టీజీఓ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యామ్‌నాయక్, బీసీ సంఘం నాయకుడు ప్రమోద్ కుమార్ ఖత్రి పాల్గొన్నారు.