Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్దతు ధరతో పూర్తి పంటను కొనాలి
- రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నాలు, ర్యాలీలు
నవతెలంగాణ- విలేకరులు
''ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే.. వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించి పూర్తి స్థాయిలో కొనాలి'' అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నాలు చేశారు. భారీ ర్యాలీలు తీశారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. మోడీ మెడలు వంచుతానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ మెడలు వంచుకుని తిరిగి వచ్చారని ఎద్దేవా చేశారు. కొప్పుల ఈశ్వర్‌కు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదన్నారు. ప్రభుత్వ ఆఫీసర్లు మిల్లర్లకు ఏజెంట్లుగా మారారని ఆరోపించారు.టీపీసీసీ ఆదేశాల మేరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రాన్ని అందజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ భవన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు.
సూర్యాపేట జిల్లాకేంద్రంలో వరిధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని, కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేనశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, టీపీసీసీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి, రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి పాల్గొన్నారు. పెన్‌పహాడ్ మండలం మాచారం గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తేమ చూసే విధానంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రైతులు ఆర్అండ్బీ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా, అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ సమీపంలో సీపీఐ(ఎం) నాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ర్యాలీ తీశారు. అటుగా వస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాన్వారును కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టడంతో మంత్రి వెళ్లిపోయారు. అనంతరం ఏవో ప్రేమ్ కుమార్‌కు వినతిపత్రం అందించారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలోని ఏఓ వినతిపత్రం అందజేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేవారు. రాష్ట్ర కిసాన్ సెల్ చైర్మెన్ అన్వేష్‌రెడ్డి మాట్లాడారు. సిరిసిల్ల ఎమ్మెల్యే. మంత్రిగా ఉండి.. షాడో సీఎంగా చలామణి అవుతున్న కేటీఆర్ జిల్లా రైతాంగాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు.