Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు అనుకూలంగా నాగ్‌పూర్ వ్యూహం
- మీడియాపైనా తుపాకీ గురి
- ఎన్నో కుట్రలను ఛేదించి విజయం సాధించిన రైతు ఉద్యమం
- ఆ దున్నపోతును హైదరాబాద్‌లోనే బంధించండి...
- బీజేపీకి బీ టీమ్‌గా టీఆర్ఎస్
- ఉద్యమంలో మరణించిన రైతులను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి
- 23 పంటలకు మద్దతు ధర కల్పించేదాకా పోరాటం
- పార్లమెంటులో రైతుఎజెండాకే ప్రాధాన్యత ఇవ్వాలి : ఏఐకేఎస్‌సీసీ మహాధర్నాలో వక్తలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ నల్ల చట్టాల రూపకల్పన ఎజెండా ఆర్ఎస్ఎస్దేననీ, నాగ్‌పూర్ కేంద్రంగా కార్పొరేట్లకు అనుకూలంగా అది వ్యూహరచన చేసిందని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జాతీయ నేత రాకేష్తికాయత్ విమర్శించారు. ఇందుకు సంబంధించి దేశ వ్యాప్తంగా పెద్ద కుట్ర జరుగుతున్నదని హెచ్చరిం చారు. చివరకు మీడియా, కలం, టీవీపైనా ఆర్ఎస్ఎస్ తుపాకీ పెట్టిందని చెప్పారు. అందులో భాగంగానే మీడియా కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాకు సంబంధించిన ప్రశ్నలే అడుగుతున్నదని వివరించారు. ఆ ఎజెండాను అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిందన్నారు. ఆ ప్రయత్నా లను రైతాంగ ఉద్యమం తిప్పికొట్టిందని చెప్పారు.
ఏఐకేఎస్‌సీసీ పిలుపుమేరకు గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని ఆహ్వానిస్తూనే...మిగతా ఆరు డిమాండ్లను పరిష్కరించాలంటూ మహాధర్నాను చేపట్టారు. టి సాగర్, పశ్యపద్మ, రాయల చంద్రశేఖర్, విస్సా కిరణ్‌కుమార్, వల్లపు ఉపేందర్‌రెడ్డి, అచ్యుత రామారావు, జక్కుల వెంకటయ్య అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో రాకేష్ తికాయత్ మాట్లాడుతూ కనీస మద్దతు ధరల చట్టం తేవాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. బీజేపీకి అన్ని విధాల మద్దతు ఇచ్చిన సీఎం కేసీఆర్...ఇప్పుడు సాగుచట్టాలను వ్యతిరేకిస్తామంటే నమ్మలేమన్నారు. బీజేపీకి టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ బీ టీమ్‌గా మారాయని విమర్శించారు. 'దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రయోజ నాలను కాపాడేందుకు ఒక దున్నపోతు తిరుగు తున్నది. దానిని హైదరాబాద్‌లోనే బంధించాలి. బయట తిరిగితే ప్రమాదం. తాడూ, బొంగరంలేని ఆ దున్నపోతును కట్టిపడేయండి' అంటూ పరోక్షంగా ఎంఐఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రైతులు సాగు చేసే ప్రతి పంటకూ మద్దతు ధర కల్పించాలనేదే తమ ప్రధాన డిమాండ్ అన్నారు. కేంద్రంలో ఉన్నది ఆర్ఎస్ఎస్ నడుపుతున్న ప్రభుత్వమనీ, ఆదానీ, అంబానీల ఆదేశాలతో అది పని చేస్తున్నదన్నారు. రైతులపై నిరంకుశంగా వ్యవహరించిన బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ కాదన్నారు. రైతు ఉద్యమ నాయకులను బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ తీవ్రమైన ఒత్తిడి చేసినా ఒక్కరూ చెక్కుచెదరలేదని చెప్పారు. 23 పంటలకు మద్దతు ధర కల్పిం చాలని కోరుతున్నప్పటికీ.. భవిష్య త్తులో పాలు, పండ్లు, కూరగాయలు తదితర పంటలకు మద్దతు ధర కోసం పోరాడతామని చెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చాలో విబేధాలు సృష్టించేం దుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నదనీ, వారి చిల్లరచేష్టలు ఉద్యమ ఐక్యతను దెబ్బతీయలేవని హెచ్చరించారు. అన్ని రంగుల జెండాలతో కలిసి దేశంలో పెద్ద సైద్ధాంతిక విప్లవమే తీసుకొస్తామన్నారు. ఉద్య మంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుం బాలను అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంటమద్దతుధర గ్యారెంటీ చట్టాన్ని చేస్తారా? లేదా? అంటూ ఎక్కడికక్కడ బీజేపీ నేత లను నిలదీయాలని రైతులకు పిలుపుని చ్చారు. రైతు సమస్యలపై ఎస్కేఎం నాయకులు, మం త్రులు, అధికారులు, శాస్త్రవేత్తలు తదితరులతో ప్రత్యేక కమిటీ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా మాట్లాడుతూ నల్ల చట్టాల ఉపసంహరణ నిర్ణయం సంతోషకరమేననీ, అయితే డిమాండ్ల కోసం సంఘర్షణ చేయాలన్నారు. రైతులకు వ్యతిరేకంగా పార్లమెంటులో నిరంకుశంగా మూడు నల్ల చట్టాలను కేంద్రం తీసుకొచ్చిం దని విమర్శించారు. స్వామినాథన్ సిఫారసుల అమలు, మద్దతు ధర గ్యారంటీ చట్టం, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ కోసం ఉద్యమిస్తా మన్నారు. రైతులు ఢిల్లీ నగరంలోకి ప్రవేశించకుండా మోడీ సర్కారు దారు లు మూసేయడంతో రైతులు అక్కడే కూర్చొని నిరసన తెలిపాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఉద్యమంలో 700 మంది రైతులు అసువులుబారాశారనీ, ఏడువేల మంది మరణించినా వెనక్కి తగ్గేదే లేదని ఆనాడే ప్రకటించామని గుర్తు చేశారు. రైతు ఉద్యమాన్ని ఎంతగా అణగదొక్కితే అంతకు రెండింతలు పైకి ఎగిసిపడుతుందని చెప్పారు.స్వామినాథన్ సిఫారుసులు అమలు చేయాలంటూ మోడీ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ కు లేఖ రాశారనీ, ఇప్పుడు ఎందుకు నిర్లక్ష్యంచేస్తున్నారని ప్రశ్నించారు.. ఈనెల 29 నుంచి ప్రతిరోజూ 500 ట్రాక్టర్లతో రైతులు పార్లమెంట్‌కు వస్తా రని చెప్పారు. సంపూర్ణ విజయం సాధించేవరకు పోరాటం కొనసాగుతుం దని స్పష్టంచేశారు. మత ఘర్షణలు, మహిళలు, విద్యార్ధులపై దాడులకు నిరసనగా.. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా రైతాంగ ఉద్యమం జరుగుతు న్నదని ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ తెలిపారు. తెలంగాణ సిఎం కెసిఆర్ రైతు వ్యతిరేకి అని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధాని మోడీకి భజన చేసే చెంచా ప్రభుత్వమని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే ఖబడ్దార్ అంటూ మోడీని హెచ్చరిం చారు. దక్షిణ భారత దేశంలో రైతాంగ ఉద్యమం బలపడాల్సిన అవసరం ఉందని ఎఐకెఎంఎస్ ప్రధాన కార్యదర్శి ఆశిష్మిట్టల్ అన్నారు. కార్పొరేట్లకు వ్యవసాయాన్ని, భూములను తాకట్టు పెట్టేందుకే మూడు చట్టాలను మోడీ తీసుకొచ్చారని విమర్శించారు. రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి కేంద్రం ఎన్నో కుట్రలు పన్నిందని చెప్పారు. క్రమంగా అన్ని రాష్ట్రాల నుంచి రైతులకు మద్దతు లభించిందన్నారు. ఉత్తరాఖండ్ కిసాన్ ఆందోళన్ నేత జగ్తర్బజ్వా మాట్లాడుతూ.. రైతులన్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలనికోరారు. దేశ,విదేశాల నుంచి వ్యతిరేకత రావడంతోనే మోడీ చట్టాలను వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. ఈస్టిండియా కంపెనీకి ప్రతిఘటన ఎదురైనట్టుగానే...సాగు చట్టాలను తిప్పికొట్టారని చెప్పారు.