Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
- కలెక్టరేట్ ఎదుట నిరసనలో ఉద్రిక్తత ొ రైతు ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ - జగిత్యాల
ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని, మిల్లర్ల ఆగడాలను అరికట్టాలని రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని మినీ స్టేడియం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు మహా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. జగిత్యాల కలెక్టరేట్ వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని రైతులు పట్టుబట్టారు. మిల్లర్ల మోసాలనుఅరికట్టి గిట్టుబాటు ధర కల్పించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇదే క్రమంలో రైతులను ఆందోళన విరమింపజేసేందుకు కలెక్టరేట్ ఎదుట నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరగా వాగ్వాదం జరిగింది. రోజుల తరబడి కల్లాల్లోనే ధాన్యం ఉందని, అన్నదాతల ఆవేదన అర్థం చేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను విన్నవించేందుకు ధర్నా వద్దకు జిల్లా కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రవి రాకపోవడంతో రైతు మల్లేశం ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా తోటి రైతులు, పోలీసులు అడ్డుకున్నారు. ఆరు గంటలపాటు సాగిన ధర్నాలో సుమారు మూడు వేల మంది రైతులు పాల్గొన్నారు.