Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బేడ్లతో పరస్పర దాడులు
నవతెలంగాణ-నెక్కొండ రూరల్/కాజీపేట
రైలులో మద్యం మత్తులో ఉన్న యువకులు హల్చల్ సృష్టించారు. బేడ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన నెక్కొండ, వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం జరిగింది. వరంగల్ ఆర్ఫీఎఫ్ సీఐ రవిబాబు వివరాల ప్రకారం.. ఉదయం గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న గొల్కోండ ఎక్స్ప్రెస్లో కేసముద్రంలో ఇద్దరు యువకులు(యాచకులు) ఎక్కారు. వారు సికింద్రాబాద్ కావటిగూడకు చెందిన చిలుకూరు అర్జున్, శ్రీశైలంకు చెందిన గుంగూరు వెంకటేశ్వర్లు. రైలు నెక్కొండకు చేరుకునేసరికి వ్యక్తిగత కారణాలతో బేడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. వెంకటేశ్వర్లకు మెడకు తీవ్ర గాయమైంది. బోగిలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. నెక్కొండలో రైలు ఆగగానే ప్రయాణికులు మరో బోగిలోకి వెళ్లిపోయారు. రైలు కదిలి ఎల్గూరు రైల్వేస్టేషన్ చేరుకోగా.. ఇద్దరు యువకులను పోలీసులు 108లో ఎంజీఎంకు తరలించారు.