Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్, కోమటిరెడ్డి మాటామంతీ
- ధర్నా చౌక్‌లోనే నిద్ర
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ చేపట్టిన ఇందిరాపార్కు వరి దీక్షా వేదికపై ఆసక్తికరమైన సన్నివేశం సాక్షాత్కరించింది. సొంత పార్టీలోనే ఉత్తర, దక్షిణ ధృవాలుగా కార్యకర్తల్లో ముద్రపడిన రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకే వేదికపై మాటామంతీ కలపడంతో కార్యకర్తల్లో మస్తు జోష్ వచ్చింది.దీంతో వారు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. ఇద్దరు కలిసి ధర్నాచౌక్‌లోనే దీక్షా వేదిక మీదనే రాత్రికి నిద్రపోతామని రేవంత్ ప్రకటించడంతో వారి ఉత్సాహం రెట్టింపైంది. ఈ దీక్షకు హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని రేవంత్ సాదరంగా ఆహ్వానించారు. రేవంత్ నియామకం తర్వాత పార్టీ కార్యక్రమాలకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పీసీసీ అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్న ఎంపీ కోమటిరెడ్డి.. తనకు ఆ పదవి దక్కకపోవడంతో పార్టీ అధిష్ఠానం పట్ల, స్థానిక నేతల పట్ల అసంతప్తి వ్యక్తంచేస్తూ వచ్చారు. అయితే, పలుమార్లు వీరిద్దరి మధ్య సంధి కుదిర్చేందుకు కొందరు పార్టీ సీనియర్ నేతలు ఎంతగానో ప్రయత్నించారు. గత కొన్ని రోజులుగా వీహెచ్ కూడా రాజీ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో వరి దీక్షకు హాజరు కానున్నట్టు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకం పట్ల అసంతప్తిగా ఉన్న కోమటిరెడ్డి.. సందర్భం దొరికినప్పుడల్లా దానిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కోట్లు పెట్టి అధ్యక్షపదవిని కొనుక్కొన్నారంటూ ఆరోపించారు.