Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ నుంచి వర్తింపచేసిన సర్కారు
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు (యూఆర్ఎస్), సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వారికి పీఆర్సీని వర్తింపజేసింది. 30 శాతం వేతనాలను పెంచుతూ జీవో నెంబర్ 117ను విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారి వేతనాలనూ పెంచుతామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ శాఖల్లోని ఇతర కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోపాటు కేజీబీవీ, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వారి వేతనాల సవరణ జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వేతనాలను పెంచడం పట్ల కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ నిరంతర కృషి
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) నిరంతర కృషి, ప్రాతినిధ్యాల ఫలితంగానే 30 శాతం వేతనాల పెంపు ఉత్త ర్వులు విడుదలయ్యాయని ఆ సంఘం అధ్యక్షులు కె జంగ య్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆలస్యంగానైనా ఉత్తర్వుల విడుదలకు సహకరించిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, కార్యదర్శి కె రామకృష్ణారావు, విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు ప్రకటించారు.