Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
వరంగల్, కాజీపేట ప్రాంతాల నుంచి గోవాకు వెళ్లాలనుకునే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి నేరుగా గోవా వెళ్లడానికి వారానికి ఒకరోజు ఈ స్టేషన్ మీదుగా 17322/21 నెంబర్‌తో వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే శాఖ నడుపుతోంది. ఇటీవల రెండు వారాల పాటు ప్రయోగాత్మకంగా నడిపిన ఈ రైలును కొద్దిరోజుల నుంచి రెగ్యులర్‌గా మార్చారు. ఈ రైలు జార్కండ్లోని జసిధిహ నుంచి వాస్కోడిగామాకి వెళ్తుంది. కాజీపేట నుంచి ప్రతి మంగళవారం సాయంత్రం 4:10 గంటలకు వచ్చి వాస్కోడిగామాకు బుధవారం 12.:40గంటలకు చేరుకుంటుంది. శుక్రవారం అక్కడ 5:15గంటలకు బయలుదేరి కాజీపేటకు మరుసటి రోజు ఉదయం 1:28 గంటలకు వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.