Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజరుకి చాడ ప్రశ్న
- వడ్ల కొనుగోలుపై స్పష్టత ఇవ్వని కేంద్రం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రశ్నించారు. కేంద్రం బాగా చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రకటించడం విడ్దూరంగా ఉందని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. తెలిపారు. వడ్లు ఎంత కొనుగోలు చేస్తారో ఇప్పటికీ చెప్పకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలు అంశం రైతులకు ఉరితాడుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వారి కష్టాలు, కడగండ్లు అంతులేకుండా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వడ్లు తడిసి మొలకెత్తి, రైతులు బజార్లో పడి ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తున్నారని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలనూ సర్వనాశనం చేసిందని విమర్శించారు. అందులో భాగంగా వ్యవసాయ రంగాన్ని దండగ మాదిరిగా చేసిందని తెలిపారు.