Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీబీ కోర్టుకు కేసు
- ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ సెక్షన్ల్ను నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపిన తెలుగు అకాడమీ కుంభకోణం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తుండగా విచారణ మాత్రం ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో జరగనుంది. కేసులో క్రిమినల్ చర్యలతోపాటు అధికార దుర్వినియోగం వంటి అంశాలు ఇమిడి ఉండటంతో సీసీఎస్ పోలీసులు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ సెక్షన్లు నమోదు చేశారు. దీంతో కేసు విచారణ ఏసీబీ కోర్టుకు బదిలీ కానుందని సమాచారం. తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను వెంకట కోటి సాయికుమార్ ముఠా కాజేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో మొత్తం 18 మంది పాత్రను సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వీరిని అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.