Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. శనివారంనాడాయన 'న్యాక్' శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కన్స్ట్రక్షన్ యూనివర్సిటీకి సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారనీ, నిపుణుల కమిటీ నివేదిక రాగానే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ ఏడాది న్యాక్ ద్వారా 20వేల మందికి శిక్షణ ఇవ్వనున్నామన్నారు. బీటెక్ చదివిన విద్యార్థులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇచ్చి నిర్మాణరంగానికి అనుసంధానం చేస్తున్నామన్నారు.