Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో శనివారం తాజాగా 160 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఒకరు చనిపోయినట్టు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,545 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మొత్తంగా శనివారం 32,540 అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా 160 మందికి కరోనా ఉన్నట్టు తేలింది. 1,186 మంది శాంపిల్స్ ఇచ్చి రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 66 మందికి పాజిటివ్ వచ్చింది.
ఆస్పత్రి నుంచి స్పీకర్ పోచారం డిశ్చార్జి
స్పీకర్ పోచారం శ్రీనివా సరెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈనెల 24న ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ కావటంతో ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌లోని ఏఐజీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేకపోవటంతో స్పీకర్‌ను డాక్టర్లు శనివారం డిశ్చార్జి చేశారు.