Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటి నిర్మాణం కోసం మట్టి తరలింపునకు తహసీల్దార్‌కు వినతి
- ఈరోజు కుదరదు.. సోమవారం ఇస్తామనడంతో ఒంటిపై డీజిల్ పోసుకున్న వైనం..
- అడ్డుకున్న కార్యాలయ సిబ్బంది
నవతెలంగాణ-టేక్మాల్
ఇంటి నిర్మాణంలో భాగంగా మట్టి తరలింపునకు అనుమతి కోరగా.. ఈరోజు కుదరదు, సోమవారం ఇస్తామని తహసీల్దార్ చెప్పడంతో ఓ వ్యక్తి ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన తహసీల్ కార్యాలయ సిబ్బంది అతన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన గొల్ల రమేష్.. టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామం వద్ద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాడు. అయితే ఆ ఇంటి నిర్మాణానికి మట్టి అవసరం ఉండటంతో..టేక్మాల్ తహసీల్దార్‌ను శనివారం అనుమతి కోరాడు.అయితే ఈరోజు కుదరదని.. సోమవారం ఇస్తామని తహసీల్దార్ చెప్పారు.కాగా ఈ సంభాషణను రమేష్ ఫోన్లో రికార్డు చేస్తుండగా.కార్యాలయ సిబ్బంది గమనించి సెల్‌ఫోన్ లాక్కున్నారు. దాంతో కోపానికి గురైన అతడు.. కార్యాలయ సిబ్బందిపై దుర్ఛాషలాడుతూ..అంతకుముందే తన వెంట తెచ్చుకున్న డీజిల్‌ను ఒంటిపై పోసుకున్నాడు.గమనించిన తహసీల్ సిబ్బంది అతని నుంచి డీజిల్ లాక్కొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని ఇంటి వద్ద క్షేమంగా దింపారు. ఈ విషయమై టేక్మాల్ తహసీల్దార్ గ్రేసిబాయిని వివరణ కోరగా.. 'రమేష్ ఇంటి నిర్మాణానికి మట్టి తరలింపునకు అనుమతి కోరగా.. సోమవారం ఇస్తామని చెప్పి నా. రోజే కావాలని పట్టుబట్టాడు. కుదరదని తెలిపాం. ఈ విషయాన్ని ఫోన్లో రికార్డు చేస్తుండటంతో.. మా సిబ్బంది ఫోన్ లాక్కున్నారు. దాంతో కోపంగా బయటికి వెళ్లి.. ఒంటిపై డీజిల్ పోసుకున్నాడు. అతను ఆఫీస్‌కు రావడం ఇదే మొదటిసారి' అని వివరించారు.