Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల సర్వసభ్య సమావేశం బహిష్కరణ
నవతెలంగాణ-నంగునూరు
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా నంగునూర మండల సర్వసభ్య సమావేశాన్ని శనివారం బహిష్కరించారు. యాసంగిలో వరిపంటను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నంగునూరు మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ జాప అరుణ దేవి అధ్యక్షతన శనివారం ఏర్పాటుచేశారు.ఈ సమావేశానికి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు,జెడ్పీటీసీలు, సర్పం చులు,ఎంపీటీసీలు హాజరయ్యారు.అయితే సమావేశం ప్రారంభంలోనే ఎంపీపీ జాప అరుణ దేవి మాట్లాడుతూ.. యాసంగి సీజన్లో వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రతిపాదిం చగా..ఎంపీటీసీ బెదురు తిరుపతి మద్దతు పలికారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నదనీ, కేంద్రం తీరుకు నిరసనగా సమావేశాన్ని బహిష్కరిస్తూ వెళ్లిపోయారు. జెడ్పీటీసీ తడిసిన ఉమ, మార్కెట్ కమిటీ చైర్మెన్ రాగుల సారయ్య, సొసైటీ చైర్మెన్ కోల రమేష్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు రహీం పాష, ఎంపీడీవో మధుసూదన్,తహశీల్దార్ భూపతి, సర్పంచులు తిప్పని రమేష్, ఎంపీటీ సీలు,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.