Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శరీర భాగాలను ముక్కలు చేసి పడేసిన వైనం
నవతెలంగాణ - గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా రామగుండం సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కాజిపల్లి గ్రామానికి చెందిన కాంపల్లి శంకర్(36)ను దుండగులు చంపేసి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేశారు. రెండ్రోజుల కిందట శంకర్ అదృశ్యం అయ్యాడు. శనివారం అతని శరీర భాగాలను ఎన్టీపీసీ ప్లాంట్ మల్యాలపల్లి క్రాసింగ్ వద్ద చెట్ల పొదల్లో రామగుండం సీఐ కణతల లక్ష్మినారాయణ, ఎన్టీపీసీ ఎస్ఐ స్వరూప్‌రాజ్ గుర్తించారు. మిగతా శరీర భాగాలను కూడా గాలించి గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శంకర్ గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌లో గల మీసేవలో పని చేస్తున్నాడు. అతని భార్య ఎన్టీపీసీ ధన్వంతరీ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం రాత్రి భార్యను బైక్‌పై తీసుకెళ్లి డ్యూటీ కోసం ఆస్పత్రి వద్ద దింపాడు. అనంతరం ఇంటికి రాలేదని శంకర్ తల్లి ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. శనివారం శంకర్ శరీర భాగాలను గుర్తించారు. నిందితుడు ఎవరో తెలిసినా పోలీసులు పట్టుకోవడం లేదని శంకర్ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, గ్రామ యువకులు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.