Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీలోఫర్‌లో చికిత్స
- ఆస్పత్రిని సందర్శించిన మానవ
- హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య
నవతెలంగాణ-సరూర్‌నగర్
హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని జ్యోతిబాఫూలే ప్రభుత్వ బీసీ గురుకుల పాఠశాలలో కలుషిత నీరు వల్ల శుక్రవారం రాత్రి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న 16 మంది విద్యార్థులను శనివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య, కమిషన్ సభ్యులు ఆనందరావు పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీ కృష్ణ, డిప్యూటీ సివిల్ సర్జన్ లాలూ ప్రసాద్ రాథోడ్‌ను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో నాలుగు రోజులుగా మంచి నీళ్లు రాక బోరు వాటర్ నీరు తాగడం వల్లే విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారని తెలిసింది.