Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసు నమోదు చేసిన పోలీసులు
నవతెలంగాణ- ఆదిలాబాద్ కలెక్టరేట్
ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తున్నారనే కారణంగా ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టాడో యువకుడు.దాంతో అతనిపైపోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ సీఐ అబ్దుల్ బాకీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పంజాబ్‌చౌక్‌లో శనివారం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.ఈ క్రమంలో అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన షేక్ ఫరీద్‌ను పోలీసులు ఆపి పత్రాలు చూపించాలని అడిగారు. సదరు వాహనంపై సుమారు రూ.3వేల వరకు పెండింగ్ చలాన్లు ఉండటం.బైక్‌కు సంబంధించి పత్రాలు లేకపోవడంతో పోలీసులు.రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి వాహనం తీసుకెళ్లాలని సూచించారు.సదరు యువకుడు అదే కాలనీకి చెందిన తన మిత్రుడైన మక్బూల్‌ను పిలిపించారు.ఇరువురు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. సహనం కోల్పోయిన మక్బూల్ ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టినట్టు సీఐ తెలిపారు. పోలీసులను దుర్భషలాడుతూ విధులకు ఆటంకం కలిగించారనే కారణంగా ఇద్దరు వ్యక్తులపై వన్‌టౌన్‌లో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ అప్పారావు తెలిపారు.