Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫూలేకు మంత్రి సత్యవతి రాథోడ్ నివాళి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీల విద్యకు, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నామని స్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్లో ఫూలే చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే కన్న కలలను సాకారం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన చేస్తున్నారని చెప్పారు. వెనుకబడిన తరగతుల విద్య, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చేందుకు అనేక చర్యలు చేపడుతూ పూలే ఆశయాలను నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ఆ రోజుల్లోనే మహిళల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, మహిళలు విద్యావంతులు కావాలనే లక్ష్యంతో తన సతీమణిని విద్యావంతురాలు చేసి, ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన గొప్ప మహనీయులని కొనియాడారు.