Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో ఈ భేటీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తాజా కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌తోపాటు ఇతర అంశాలపై కూడా చర్చించనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.