Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో 30 గంటల దీక్ష
నవతెలంగాణ-కాజీపేట
కాజీపేట రైల్వే జంక్షన్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేలా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినరుభాస్కర్, సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యదర్శి చుక్కయ్య పిలుపునిచ్చారు. విజయవాడకు తరలించిన రైల్వే క్రూ లింకులను కాజీపేటకు తిరిగి తీసుకురావాలనీ, ఇతర ప్రాంతాలకు తరలుతున్న పరిశ్రమలను ఇక్కడే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన 30 గంటల నిరాహార దీక్షకు టీఆర్ఎస్, సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, బీజేపీయేతర అన్ని రాజకీయ పార్టీలూ సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినరుభాస్కర్, ఆరూరి రమేష్, నగర మేయర్ గుండు సుధారాణి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య, జనగామ డీసీసీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి, తెలంగాణ మాలమహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్, ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ ప్రసంగించారు. కాజీపేట జంక్షన్‌కు పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా జరిగే పోరాటాల్లో భాగస్వాములమౌతామని చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా చేపట్టిన పోరాటానికి అండగా ఉంటామన్నారు. కాజీపేట నుంచి విజయవాడకు తరలించిన క్రూలింకులను తిరిగి తీసుకురావడంతోపాటు ఇతర ప్రాంతాలకు తరలించిన పరిశ్రమలను ఇక్కడే నెలకొల్పేలా ఉద్యమాలు తప్పవని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ.. తెలంగాణ ప్రాంతంలోని కాజీపేట రైల్వే జంక్షన్‌ను నీరుగార్చేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్, టౌన్ స్టేషన్ అభివృద్ధి కోసం పోరాటాలు తప్పవ న్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రజాలీ, సంకు నర్సింగరావు, మాజీ కార్పొరేటర్ తోట్ల రాజు యాదవ్, కాంగ్రెస్ నాయకులు విజరుకుమార్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, నాయకులు రవి, రాంచందర్, సురేందర్, జేఏసీ నాయకులు కొండ్రా నర్సింగరావు, దేవులపల్లి రాఘవేందర్, సంగమయ్య, జానీ, రాజలింగం, రవీందర్, సుధాకర్, రమేష్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.