Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు, రేపూ మండల కేంద్రాల్లో ఎద్దుల బండ్లతో నిరసనలు : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించేదాకా దశలవారీగా ఉద్యమం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు కుమార్ ప్రకటించారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోనూ ఎద్దుల బండ్లతో నిరసనలు తెలుపుతామని తెలిపారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర నేతలు, వివిధ మోర్చాల నాయకులతో ఆయన ఆదివారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..డిసెంబర్ ఒకటో తేదీన బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ప్లకార్డులు,నల్లబ్యాడ్జీలతో, రెండోతేదీ న మహిళా మోర్చా ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై బ్యానర్లతో నిరసనలు తెలుపుతామని చెప్పారు.మూడో తేదీన ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద, నాలుగో తేదీన ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల వద్ద ధర్నాలు చేస్తామని తెలిపారు.ఐదో తేదీన ఎస్టీ మోర్చా, ఆరోతేదీన కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మార్కెట్ యార్డుల వద్ద నిరసన తెలుపుతామన్నారు. ఏడో తేదీన మైనార్టీ మోర్చా కార్యకర్తల ధర్నా ఉంటుందన్నారు.