Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగుల సంఖ్య పెంచారు
- కార్పొరేట్ కంపెనీలకు మోడీ దాసోహం
- సీపీఐ(ఎం) కామారెడ్డి జిల్లా మహాసభల్లో
- రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి
నవతెలంగాణ-బాన్సువాడ
ప్రజాసమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగ సమస్యను మరింతగా పెంచారని ఆరోపించారు. సీపీఐ(ఎం) కామారెడ్డి జిల్లా 2వ మహాసభ బాన్సువాడ పట్టణంలో ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహాసభకు హాజరై నంద్యాల ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకోసం మాత్రమే పని చేస్తుందనీ, అందుకే దేశంలో సంపన్నుడు మరింత ధనవంతుడుగా మారుతున్నాడని చెప్పారు. పేదలు మరింత పేదరికంలోకి దిగజారుతున్నారన్నారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. వెంకట్రాములు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వరి పంట మొత్తం కొనుగోళ్లు చేయాలనీ, కేంద్రంపై పోరాటం చేసైనా కొనుగోళ్లపై రైతులకు భరోసా కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి వెంకట్‌గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు రవీందర్, చంద్రశేఖర్, ఎమ్డీ ఖలీల్, డి.మోతీరాం, ఎల్లయ్య, సురేశ్ గొండ, నర్సింలు, అరుణ్, అజరు, పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు, నాయకులు నూర్జహాన్, లత, యాదగిరిగౌడ్, సాయిలు, రాజు తదితరులు పాల్గొన్నారు.