Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు మద్దతుగా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి:
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య
- ముగిసిన పార్టీ సిద్దిపేట జిల్లా ద్వితీయ మహాసభలు
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
మూడు నల్ల చట్టాల రద్దుతో పాటు రైతులకు కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య తెలిపారు. సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా ద్వితీయ మహాసభ ముగింపు సమావే శానికి ఆయన హాజరై మాట్లాడారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని ఏడాది కాలంగా రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ పోరాటంలో అమరులైన రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలనీ, రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కల్లాల్లో పోసుకున్న రైతులు వానకు తడుస్తూ ఆవేదన చెందుతుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కొనుగోళ్లు చేపట్టకుండా నాటకాలాడుతున్నాయని విమర్శించారు. కేసీఆర్కు రైతులపై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంతో వడ్ల కొనుగోలు విషయమై నిజాయితీగా పోరాటం చేయాలని సూచించారు. ఒక్క రోజు ధర్నాతో సమస్యలు పరిష్కారం కావనీ, సీఎం ఇప్పటికైనా గాలి మాటలు మానుకో వాలన్నారు. కార్మిక, రైతాంగ, ప్రజల సమస్యలపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భవిష్యత్తులో మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కాగా, పార్టీ మహాసభల్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు రమ, జిల్లా నాయకులు గోపాలస్వామి, కళావతి, శశిధర్, యాదగిరి, ఎల్లయ్య, భాస్కర్, రవి, అరవింద్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.